One Body & One Baptism

One Body & One Baptism

 

Theme : One Body and One Baptism

CSI Holy Cross Church, ECIL Pastorate

Morning Service with Holy Communion – 6:30 AM
Speaker: Rev. S. Kamalakar

General Service  – 9:00 AM
Speaker: Rev. B. Winston

CSI Holy Cross St. Matthew Church, Dammaiguda

General Service with Holy Communion 9:30 AM
Speaker:  Rev. S. Kamalakar

Bible Lessons:

1 మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక

2 వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?

3 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు

4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు

5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు

6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు

7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.

8 వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.

9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము

11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.

12 యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును

13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.

14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.

15 భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.

16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.

17 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు

18 మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.

5 ఆయన సైన్యములకధిపతి యగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును.

6 ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.

7 ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయు లును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశ ములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని.

8 ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్ఠి రాజ్యముమీదనున్నది, దానిని భూమిమీద ఉండకుండ నాశనము చేతును. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశముచేయక విడిచి పెట్టుదును; ఇదే యెహోవా వాక్కు.

9 నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లిం తును గాని యొక చిన్న గింజైన నేల రాలదు.

10 ​ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జను లలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు.

11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు

12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరి గించు యెహోవా వాక్కు ఇదే.

1 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,

2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,

3 ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

4 శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.

5 ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.

13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చిమనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా

14 వారుకొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్త లలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

15 అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.

16 అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.

17 అందుకు యేసుసీమోను బర్‌ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు2 నీకు బయలు పరచలేదు.

18 మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

19 పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

20 అటుపిమ్మట తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

1 Not to us, Lord, not to us but to your name be the glory, because of your love and faithfulness.

2 Why do the nations say, “Where is their God?”

3 Our God is in heaven; he does whatever pleases him.

4 But their idols are silver and gold, made by human hands.

5 They have mouths, but cannot speak, eyes, but cannot see.

6 They have ears, but cannot hear, noses, but cannot smell.

7 They have hands, but cannot feel, feet, but cannot walk,

nor can they utter a sound with their throats.

8 Those who make them will be like them, and so will all who trust in them.

9 All you Israelites, trust in the Lord— he is their help and shield.

10 House of Aaron, trust in the Lord— he is their help and shield.

11 You who fear him, trust in the Lord— he is their help and shield.

12 The Lord remembers us and will bless us: He will bless his people Israel, he will bless the house of Aaron,

13 he will bless those who fear the Lord— small and great alike.

14 May the Lord cause you to flourish, both you and your children.

15 May you be blessed by the Lord, the Maker of heaven and earth.

16 The highest heavens belong to the Lord, but the earth he has given to mankind.

17 It is not the dead who praise the Lord, those who go down to the place of silence;

18 it is we who extol the Lord, both now and forevermore.

5 The Lord, the Lord Almighty— he touches the earth and it melts, and all who live in it mourn; the whole land rises like the Nile, then sinks like the river of Egypt;

6 he builds his lofty palace[a] in the heavens and sets its foundation[b] on the earth; he calls for the waters of the sea and pours them out over the face of the land— the Lord is his name.

7 “Are not you Israelites the same to me as the Cushites[c]?” declares the Lord. “Did I not bring Israel up from Egypt, the Philistines from Caphtor[d] and the Arameans from Kir?

8 “Surely the eyes of the Sovereign Lord are on the sinful kingdom. I will destroy it from the face of the earth. Yet I will not totally destroy the descendants of Jacob,” declares the Lord.

9 “For I will give the command, and I will shake the people of Israel among all the nations as grain is shaken in a sieve, and not a pebble will reach the ground.

10 All the sinners among my people will die by the sword, all those who say, ‘Disaster will not overtake or meet us.’

11 “In that day “I will restore David’s fallen shelter— I will repair its broken walls and restore its ruins— and will rebuild it as it used to be,

12 so that they may possess the remnant of Edom and all the nations that bear my name,[e]” declares the Lord, who will do these things.

1 As a prisoner for the Lord, then, I urge you to live a life worthy of the calling you have received.

2 Be completely humble and gentle; be patient, bearing with one another in love.

3 Make every effort to keep the unity of the Spirit through the bond of peace.

4 There is one body and one Spirit, just as you were called to one hope when you were called;

5 one Lord, one faith, one baptism; 6 one God and Father of all, who is over all and through all and in all.

13 When Jesus came to the region of Caesarea Philippi, he asked his disciples, “Who do people say the Son of Man is?”

14 They replied, “Some say John the Baptist; others say Elijah; and still others, Jeremiah or one of the prophets.”

15 “But what about you?” he asked. “Who do you say I am?”

16 Simon Peter answered, “You are the Messiah, the Son of the living God.”

17 Jesus replied, “Blessed are you, Simon son of Jonah, for this was not revealed to you by flesh and blood, but by my Father in heaven.

18 And I tell you that you are Peter,[a] and on this rock I will build my church, and the gates of Hades[b] will not overcome it.

19 I will give you the keys of the kingdom of heaven; whatever you bind on earth will be[c] bound in heaven, and whatever you loose on earth will be[d] loosed in heaven.”

20 Then he ordered his disciples not to tell anyone that he was the Messiah.

Our Church Social Channels

YouTube – https://www.youtube.com/csiholycrosschurch

Facebook – https://www.facebook.com/csiholycrosschurchecil

Twitter – https://www.twitter.com/CSIHCC⁠⁠⁠⁠